Please Click on to see the Details

జన విజ్ఞాన వేదిక హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందా?
ఉత్తమ పౌర సమాజమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం జన విజ్ఞాన వేదిక ప్రచురణలు - స్కూల్ పిల్లలకు ప్రత్యేకం డాక్టర్ అరవింద్ గుప్త టోయ్స్ ఈజీ టీచింగ్ నిరంతర కార్యక్రమాల ఫోటోలు 1 నిరంతర కార్యక్రమాల ఫోటోలు 2 నిరంతర కార్యక్రమాల ఫోటోలు 3 2010 హైదరాబాదులో జరిగిన ప్లినం ఫోటోలు Dr.V.Brahma Reddy's...Kotta Todelu - Kotta Gorrelu డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారిఅంతరంగం - ఆంధ్ర జ్యోతి ప్రచురణ డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారి మంచి సమాజం కోసం వ్యాసం డాక్టర్ వి. బ్రహ్మ రెడ్డి గారి పరిక్షలంటే భయమా? వ్యాసం డాక్టర్ రామ్ మోహన్ రావు గారి బృందం ఆట పాట వీడియో 2008 నెల్లూరులో జరిగిన రాష్ట్ర మహాసభ డార్విన్ మరియు గలేలియో ఉత్సవాలు 2009 జే.వి.వి. సైన్సు టాలెంట్ టెస్ట్ విజేతలు కర్నూల్ వరదల్లో ఉత్తమ సేవా కర్నూల్ వరదల్లో ఉత్తమ సేవా ఎన్.టి.ఆర్. పురస్కారం శాంభవి తీర్పు వీడియో ఆదర్శనీయులు లక్ష్మి రెడ్డి లక్ష్మి నారాయణమ్మ దంపతులు వీడియో మేలుకొలుపు వీడియో పాట, JVV Science Talent Test Model Papers ఆదర్శనీయ వివాహ పత్రిక
మంచి మానవ సంభందాలు వీడియో చూడండి రజితోత్సవ వేడుకల ఫోటోలు 1 రజితోత్సవ వేడుకల ఫోటోలు 2 రజితోత్సవ వేడుకల ఫోటోలు 3 ప్రజా సైన్సు ఉద్యమం - నేటి అవసరం నిజాలను చూడగలిగే ధైర్యం మీకు ఉందా?ఐతే ... పుట్టపర్తిలో జరిగిన అరాచకాలపై టి.వి.9 ప్రచారం చేసిన సంచలన కథనం ఒక గంటసేపు చూడండి. మీరు గుర్తించిన వాస్తవాలను నలుగురికి చెప్పండి. జన విజ్ఞాన వేదిక రూపొందించిన దేశభక్తి చైతన్య గీతాలు మరియు సిల్వర్ జూబిలీ వీడియో చేప ప్రసాదం తీర్పు ప్రతి డాక్టర్ వి. బ్రహ్మా రెడ్డి జైత్ర యాత్ర
ఎ పి జన విజ్ఞాన వేదిక మహాసభ 2015 , గుంటూరు ఫోటోలు

Saturday, March 12, 2011

ప్రజా సైన్సు ఉద్యమం - నేటి అవసరం

ప్రజా సైన్సు ఉద్యమం - నేటి అవసరం

భారత రాజ్యాంగం 51వ అధికరణంలో నిర్దేశించినట్లు పౌరుల్లో శాస్త్రీయ దృష్టిని, మానవతా విలువలను పెంపొందించే క్రమంలో 1987లో దేశవ్యాప్తంగా భారత జన విజ్ఞాన జాతాను ప్రముఖ శాస్త్రవేత్తలు, కళాకారుల నేతృత్వంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీని పర్యవసానంగానే శాస్త్ర విజ్ఞాన ఫలాలు సామాన్యునికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రజల కోసం సైన్సు, దేశం కోసం సైన్సు, స్వావలంబన కోసం సైన్సు లక్ష్యాలుగా తెలుగునాట ఒక శాస్త్ర ప్రచార సంస్థ 1988లో ఆవిర్భవించింది. అదే జన విజ్ఞాన వేదిక (జెవివి). ప్రజా సైన్సు ఉద్యమ ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తయి తాను ఎంచుకున్న లక్ష్యాల సాధనలో ఏ మేరకు విజయం సాధించిందీ, ఇంకా ముందు ముందు ఏ దిశలో పయనించవలసి ఉందీ సమీక్షించుకునే సందర్భం. ఒక సైన్సు ప్రచార సంస్థగానే కాకుండా ఒక ప్రజా సైన్సు ఉద్యమంగా సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భారత రాజకీయ యవనిక పైకి నూతన ఆర్థిక విధానాలు అప్పుడప్పుడే ముందుకొస్తున్న కాలంలో ఆవిర్భవించింది జన విజ్ఞాన వేదిక (జెవివి). జాతీయ ఔషధ విధానం పేరుతో అప్పటికే భారత ఔషధ రంగానికి ఎంతో మేలు చేసిన, వెనుకబడిన దేశాల్లో ప్రజారోగ్యానికి చేయూతనిచ్చిన 1970 భారత ఔషధ చట్టానికి తూట్లు పొడిచే కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే ఔషధాల ధరల నిర్ణయ పద్ధతిని, ఔచిత్యాన్ని ఎండగడుతూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టింది. ఆనాడున్న (నేటికి కూడా) వేలాది మందుల బండారాన్ని బట్టబయలు చేసింది. పశ్చిమదేశాల్లో నిషేధించబడిన ఎన్నో ఔషధాలను మన దేశంలో సంజీవనులుగా ప్రచారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనాన్ని సదస్సులు, సాహిత్యం, కరపత్రాల వంటి పలు రూపాల్లో జనంలోకి తీసుకుపోయి తొలి అడుగువేసింది జెవివి.

అప్పుడు జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన అక్షరాస్యతా కార్యక్రమం జెవివి ముందుకు వచ్చింది. నిరక్షరాస్యత సకల రుగ్మతలకు మూలమని, దాన్ని తొలగిస్తే వారిని మూఢనమ్మకాల నుంచి విముక్తి చేయడమేకాక జీవితంలో హేతుబద్ధంగా ఆలోచించే శక్తినిస్తుందని నమ్మి సాక్షరతా ఉద్యమంలో పెద్దఎత్తున పాల్గొని తనవంతు పాత్రను పోషించింది. సామాన్యుణ్ణి అక్షరంతో సాయుధం చేస్తే ఏమవుతుందో సాక్షరతా ఉద్యమం దేశ ప్రజలకు చూపింది. అక్షరాలు నేర్చుకున్న జనులకు సామాజిక చైతన్యాన్ని నింపే తదనంతర పాఠాలను జెవివి రూపొందించి, నేర్పినప్పుడు ప్రజలెలా శాస్త్రీయంగా ఆలోచించగలరో మనకు 'దూబగుంట' నిలువెత్తు సాక్ష్యం. అది నాటి మాట.

మరి నేటి పరిస్థితి ఏమిటి? మనం 21వ శతాబ్దంలో ఓ పది సంవత్సరాలు పయనించాం కూడా. ఆధునిక విజ్ఞాన శాస్త్రం రాకెట్‌ వేగంతో ముందుకు పోతున్న కాలం. ఇంకా ఇలాంటి జెవివి వంటి సంస్థలకు స్థానం, అవసరం ఉన్నాయా? నిజమే! కానీ మనమెక్కడున్నాం? మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజల స్థితి ఏమిటి? సామాన్యుని మాట అటుంచి కొంత కలిగిన వాడికి కూడా అందనంత దూరంగా వైద్యం కొండెక్కి కూచుంది. ప్రజారోగ్యం గగన కుసుమంగా మారింది. 2000 నాటికే 'అందరికీ ఆరోగ్యం' అన్న నినాదం గాలిలో కలిసిపోయింది. నూటికి 46 మంది పిల్లలు పోషకాహార లేమితో కునారిల్లుతున్నారు. ఇది ఆరోగ్య రంగ దుస్థితి.

విద్య విషయానికొస్తే అది ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. సమాజాన్ని ఒకటి చేయవలసిన విద్య సమాజాన్ని మరింత చీలికలు పేలికలుగా తయారుచేసే అసమానతలు పెంచే సాధనంగా మారింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. వ్యవసాయదారుడు ఉరికొయ్యన ఉన్నాడు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కంపెనీలు సొమ్ము చేసుకుని రైతుల ప్రాథమిక హక్కైన విత్తనాన్ని సైతం కొల్లగొడుతున్నాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం ఒకటేమిటి అన్ని రంగాల్లో అశాస్త్రీయ ధోరణులు పాగా వేశాయి. సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన్లో సైతం దేశం వెనుకబడి ఉన్నది. సాక్షాత్తూ మన ప్రధాన మంత్రే ఈ యేడాది సైన్సు కాంగ్రెస్‌ సభలో ప్రసంగిస్తూ ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలను, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోది చేయాలని ఉద్భోదించారు. సమాజంలో ప్రతి వ్యవస్థ సంక్షోభపుటంచుల్లో ఉందన్నది వాస్తవం. నేడు సైన్సు బోధన ఏ రకమైన ప్రయోగాలు లేకుండా నిర్వీర్యంగా తయారైంది. పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం కలిగించాలంటే ముందుగా సుశిక్షితులైన ఉపాధ్యాయులు తయారు కావాలని నమ్మి కారు చీకటిలో కాంతి రేఖలా సైన్సు బోధనలో ఉపాధ్యాయ శిక్షణను చేపట్టింది. ప్రయోగాల ద్వారా బోధించే పద్ధతిని చేసి చూపుతున్నది. అశాస్త్రీయ ధోరణులు ఎక్కడున్నా ముందుగా జెవివి అక్కడ ప్రత్యక్షమవుతుంది. జనాభాలో ఆడపిల్లల సంఖ్య దారుణంగా పడిపోతున్నది. స్త్రీ, పురుష నిష్పత్తి పడిపోవటంపై సమతా విభాగం ప్రత్యేక కార్యక్రమాల ద్వారా చైతన్యపరిచే పనిలో ఉంది.
వ్యవసాయ రంగంలో ముఖ్యంగా జన్యుమార్పిడి పంటలు వచ్చిన నేపత్యంలో రైతు విత్తన హక్కును రక్షించేందుకు జన విజ్ఞాన వేదిక, ఇతర రైతు సంఘాలతో కలిసి 'రైతు రక్షణ వేదిక' నేర్పరచి గుంటూరు జిల్లా పత్తి రైతులతో 'మన కోసం మనం' స్ఫూర్తిని నింపే ప్రయోగం చేపట్టింది. మొత్తం 29 మండలాలు, 69 గ్రామాల్లో బిటియేతర పత్తి రకాలను, వివిధ పత్తి వెరైటీలను ప్రోత్సహించి తక్కువ పెట్టుబడితో లాభదాయక వ్యవసాయాన్ని రైతుల ద్వారా చేయించింది. ప్రజల కోసం సైన్సు అన్న లక్ష్యానికి దగ్గరగా, ప్రజల్లో ఉన్న విజ్ఞానాన్ని నేటి పరిస్థితులకు అన్వయించి సేంద్రీయ ఎరువులను, పురుగు మందులను లేకుండా చేసే సహజమైన ఇకలాజికల్‌ అగ్రికల్చర్‌ను ప్రోత్సహించే క్రమంలో ఈ ప్రయోగం ఒక తొలి అడుగుగా జెవివి భావిస్తున్నది. నేడు పర్యావరణం మాత్రమే కాకుండా భూగోళం ఉనికే ప్రమాదంలో పడింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న కార్బన్‌డైఆక్స్‌డ్‌, హరితవాయువులు వాతావరణాన్ని తలక్రిందులు చేస్తున్నాయి. 2050 నాటి భూతాపం మరో 8 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇది తక్షణం నిలువరించవలసిన అవసరం ఉంది. దీని బాగోగులు, ఆవశ్యకత ప్రజలకు చెప్పి చైతన్యపరిచే అర్హత, శక్తి జనవిజ్ఞాన వేదికకు ఉన్నాయి.

ఈ క్లిష్ట సమయంలో ప్రజలను హేతుబద్ధమైన ఆలోచనలవైపు మళ్లించడానికి , శాస్త్ర విజ్ఞాన ఫలాలు సామాన్య రైతులకు, పేదవాడికి చేరటానికి జనవిజ్ఞానవేదిక అవసరం మునుపటి కన్నా ఎక్కువగా ఉంది. వేలాది సభ్యులతో, లక్షలాది శ్రేయోభిలాషులతో పాతికేళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ మరో ముందడుగు వేసేందుకు పునరంకితమవుతున్నది జనవిజ్ఞాన వేదిక.
ప్రొఫెసర్‌ కట్టా సత్యప్రసాద్‌
 

About us

My photo
Hyderabad, Andhra Pradesh, India
(not affiliated to any political party) is a one of the biggest voluntary science promoted organisation.